![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-749లో.. జ్యోత్స్నలో వచ్చిన మార్పుతో కథ ఆసక్తికరంగా మారుతుంది. రెస్టారెంట్ దక్కించుకునే విషయంలో మాలినితో పోటీ పడుతున్న జ్యోత్స్నకు దీప అండగా నిలుస్తుంది. ఈ రెస్టారెంట్లో పనిచేసే ఒక్కరిని ఉద్యోగం నుంచి తీసేయం. జీతాలు 10 శాతం పెంచుతాం.. అవసరమైతే పర్సనల్ లోన్లు కూడా ఇప్పిస్తామని జ్యోత్స్న హామీలు ఇస్తుంది. సూరజ్ కూడా ఉద్యోగులతో.. ఒక్కరోజు బిర్యానీ తింటారా? లేక ప్రతి పూటా తృప్తిగా భోజనం చేస్తారా అని ఆలోచించమంటాడు. చివరకు ఉద్యోగులు జ్యోత్స్న వైపే నిలబడటంతో రెస్టారెంట్ ఆమెకే దక్కుతుంది. కంగ్రాట్స్ జ్యోత్స్నా.. తాత పేరుని మరోసారి నిలబెట్టావని శివన్నారాయణ అభినందిస్తాడు.
మాలిని వెళ్లిపోతూ.. పోటీ పడటంలో మేనత్త పోలికలే వచ్చినట్టున్నాయని జ్యోత్స్నను రెచ్చగొడుతుంది. దానికి జ్యోత్స్న, నీతో నన్ను పోల్చుకోకు అత్తా అని గట్టిగా సమాధానమిస్తుంది. దీప కూడా.. ఓడించాలని ఆటలోకి దిగితే దమ్ముతో గెలవాలి.. అడ్డదారిలో వెళ్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందంటూ మాలినికి కౌంటర్ ఇస్తుంది. ఇదంతా సూరజ్‌ని ఇంప్రెస్ చేయడానికే కదా అని కార్తీక్ అడుగుతాడు. లేదు బావా.. నా కోసమే చేశానని జ్యోత్స్న చెప్తుంది. ఇంతలో సూరజ్ నుంచి “గుడ్ వర్క్” అంటూ మెసేజ్ రావడంతో జ్యోత్స్న మురిసిపోతుంది. ఆ మెసేజ్ చూసి ఆమె నవ్వడాన్ని గమనించిన సూరజ్ కూడా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తాడు.
మరుసటి రోజు ఆఫీస్‌లో జ్యోత్స్న సూరజ్ ఎదురుగా కూర్చుంటుంది. కొత్తగా చేరిన గీత సూరజ్‌తో మాట కలపగా, జ్యోత్స్నను ఆటపట్టించడానికి సూరజ్ కావాలనే.. మీరు నాకు నచ్చారని అంటాడు. వెంటనే గీత కూడా.. మీరు నాకు బాగా నచ్చారు.. మీకు పెళ్లైందా అని అడుగుతుంది. దాంతో జ్యోత్స్నకు కోపం వచ్చి.. ఏయ్.. ఇక్కడేం చేస్తున్నారంటూ మండిపడుతుంది. సూరజ్ గీతతో చేయి కలపడంతో ఆమె మరింత అసూయపడుతుంది. మనం ఎప్పుడు కలుద్దాం? మీ మొబైల్ నెంబర్ ఇస్తే సేవ్ చేసుకుంటా అని గీత అడగుతుంది. జ్యోత్స్న కోపంతో ఆఫీస్ బాయ్‌ని గట్టిగా పిలుస్తుంది. గీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సూరజ్ మాత్రం జ్యోత్స్నను ఆటపట్టించినందుకు తనలో తను నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Karthika Deepam 2, Star Maa Serials, Jyotsna, Deepa, Karthika Deepam Latest Episode
![]() |
![]() |